Surprise Me!

రెండు చానళ్ళపై, ఒక ఎంపీపై..100 కోట్ల పరువునష్టం దావా : పీవీపీ || Oneindia Telugu

2019-04-17 779 Dailymotion

ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ సిపి విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు రెండు తెలుగు వార్తా ఛానళ్ళపై, ఒక ఎంపీ పై ఒక్కొక్కరిపై 100 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఒక వ్యక్తిని లేదా రాజకీయ పార్టీని లక్ష్యంగా పెట్టుకోకుండా సానుకూల రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నానని కానీ నా నిశ్శబ్దం అసమర్ధతగా భావించారని ఆయన మండిపడ్డారు . కొన్ని తెలుగు వార్తా ఛానళ్ళు ఉద్దేశపూర్వకంగా తనపై వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని చేశాయన్న పీవీపీ వాటికి చట్టం పవర్ ఏంటో చూపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ వ్యవహారం ఇంతటితో విడిచి పెట్టేది లేదన్న పీవీపీ ఐదు లేదా 10 లేదా 25 సంవత్సరాలు తీసుకున్నా పర్లేదు కానీ నేను సదరు వార్తా ఛానల్స్ ను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు.

#pvp
#ysrcp
#potlurivaraprasad
#ycp
#vijayawada
#oopiri
#kesineninani
#sruthihaasan
#maheshbabu
#tdp

Buy Now on CodeCanyon